Paytm: పేటీఎంలో కొత్త సదుపాయం.. ఇతర UPI యాప్స్‌కు పేమెంట్స్
మొబైల్ నంబర్ ఆధారంగా ఇతర యూపీఐ యాప్స్‌కూ డబ్బులు పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ (UPI) ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయాలంటే అవతలి వ్యక్తి యూపీఐ ఐడీ మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఫోన్ నంబర్ ఆధారంగా డబ్బులు పంపించాలంటే అదే యాప్‌ను మనమూ వాడుతుండాలి. ఒకరి వద్ద ఉన్న యాప్ వేరే వారి వద్ద లేనప్పుడు; ఇద్దరూ ఒకే యాప్‌ను వాడని సందర్భంలో పేమెంట్స్ చేయడం వీలు పడదు. కానీ, ఇకపై సాధ్యమే అంటోంది పేటీఎం (Paytm). మొబైల్ నంబర్ ఆధారంగా ఇతర యూపీఐ యాప్స్‌కూ డబ్బులు పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటించింది. సదరు వ్యక్తి పేటీఎంలో రిజిస్టర్ అవ్వకపోయినా పేమెంట్ చేయడం సాధ్యమేనని పేర్కొంది.
యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించి తమ యూనివర్సల్ డేటాను పరస్పరం పంచుకోవాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సర్వీసు ప్రొవైడర్లకు సూచించింది. దీనివల్ల ఏ యాప్ వినియోగదారులైనా ఇతర యూపీఐ యాప్ కలిగిన వ్యక్తులకు లావాదేవీలు చేయొచ్చు. ఫలానా యూపీఐ యాప్ ద్వారానే పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే పేటీఎం తాజా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సేవలను పొందాలంటే పేటీఎం యాప్‌లోని యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ సెక్షన్‌కు వెళితే ‘టు యూపీఐ యాప్స్’ అనే సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏ యూపీఐ యాప్‌కైనా చెల్లింపులు చేయొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Politics News
Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
-
World News
Donald Trump: ‘24 గంటల్లోపే ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించుతా..!’
-
Sports News
IND vs AUS:ఈ భారత స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేస్తే చాలు.. : హేజిల్‌వుడ్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Education News
TSPSC: మరో నియామక పరీక్ష వాయిదా