స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు

2023, జూన్‌ నెలలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండింటిలో పెట్టుబడులు బాగా పెరిగాయి.

Published : 10 Jul 2023 20:44 IST

దిల్లీ: ఓపెన్‌-ఎండ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లోలు జూన్‌లో 167% పెరిగి రూ.8,637 కోట్లకు చేరాయని, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో రికార్డు స్థాయిలో నికర పెట్టుబడులు నమోదైనట్టు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (AMFI) డేటా వెల్లడించింది. ఈక్విటీ ఇన్‌ఫ్లోలు సానుకూలంగా ఉండడం ఇది వరుసగా 28వ నెల. మార్చి నుంచి భారతీయ మార్కెట్‌ మంచి రికవరీని సాధించి, సెన్సెక్స్‌ దాదాపు 7% లాభపడిన నేపథ్యంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి మంచి ఇన్‌ఫ్లోలు వచ్చాయి. జూన్‌లో సెన్సెక్స్‌ 0.70% పెరిగింది. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP)ల ద్వారా పెట్టుబడులు జూన్‌లో రూ.14,734 కోట్లు వచ్చాయి. మే నెలలో SIPలు సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి(రూ.14,749 కోట్ల)ని తాకాయి. ఈక్విటీ విభాగంలో జూన్‌లో నికర ఇన్‌ఫ్లోలు నెలవారీగా 66% పెరిగి రూ.5,471.75 కోట్లకు చేరుకోవడంతో స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లకు డిమాండ్‌ కొనసాగింది. గడిచిన నెలలో స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండూ పెరిగాయి. ఇన్వెస్టర్లు రెండేళ్ల నుంచి ఈ రెండు విభాగాల్లోనూ స్థిరంగా పెట్టుబడులు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని