నరేశ్‌ గోయల్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు.. ఈడీ

మనీ లాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్‌ కోరడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది.

Published : 04 May 2024 03:26 IST

దిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్‌ కోరడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. ఆయన ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఉండటాన్ని నెల రోజుల పాటు పొడిగించొచ్చని పేర్కొంది. నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య అనితా గోయల్‌ ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.  మానవతా దృక్పథంతో తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాల్సిందిగా గోయల్‌ ముంబయి హైకోర్టు ను కోరారు. దీనిపై మే 6న ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్‌ ఎన్‌జే జమాదర్‌ వెల్లడించారు. గోయల్‌కు బెయిల్‌ను ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. అయితే వైద్య చికిత్స కోసం నచ్చిన ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆయన చేరేందుకు అనుమతి ఇచ్చింది. గత వారం మధ్యంతర బెయిల్‌ కోరుతూ మరోసారి గోయల్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని