Azim Premji: కుమారులకు రూ.480 కోట్ల గిఫ్ట్‌.. అజీమ్‌ ప్రేమ్‌జీ నిర్ణయం

Azim Premji: విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ తన కుమారులకు రూ.480 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను బదిలీ చేశారు. వీటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

Updated : 25 Jan 2024 14:13 IST

దిల్లీ: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో (Wipro) వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ (Azim Premji) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాటా నుంచి 1.02 కోట్ల ఈక్విటీ షేర్ల (Equity Shares)ను ఇద్దరు కుమారులకు బదిలీ చేశారు. వీటి విలువ రూ.480 కోట్లకు పైమాటే. ఈ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

విప్రోలో అజీమ్‌ ప్రేమ్‌జీ 22.58కోట్ల షేర్లతో 4.32శాతం వాటాను కలిగిఉన్నారు. ఇందులో నుంచి 0.20శాతం వాటాను తన కుమారులు రిషద్‌ (Rishad Premji), తారిఖ్‌కు సమానంగా బదిలీ చేశారు. మొత్తం 1.02 కోట్ల షేర్లను కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.472.9గా ఉంది. ఆ లెక్కన దాదాపు రూ.483 కోట్లను అజీమ్‌ తన వారసులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ షేర్ల బదిలీతో కంపెనీలో ఆయన వాటా 4.12 శాతానికి తగ్గింది.

ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్‌.. నేటి నుంచే అమల్లోకి

విప్రోలో అజీమ్‌ కుటుంబానికి మొత్తం 4.43 శాతం వాటా ఉంది. ఇందులో ఆయన భార్య 0.05శాతం, కుమారులిద్దరూ 0.13 శాతం చొప్పున షేర్లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం రిషద్‌ ప్రేమ్‌జీ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మరో కుమారుడు తారిఖ్‌.. అజీమ్‌ ప్రేమ్‌జీ ఎండోమెంట్‌ ఫండ్‌ (దాతృత్వ సంస్థ)కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు