Tata Nexon: టాటా నుంచి నెక్సాన్‌, నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

Tata Nexon, Nexon EV launched: టాటా మోటార్స్ నెక్సాన్‌, నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. నెక్సాన్‌ ధరలు రూ.8 లక్షల నుంచి, నెక్సాన్‌ ఈవీ ధరలు 14.74 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 14 Sep 2023 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata motors) తన విజయవంతమైన ఎస్‌యూవీ నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ను (Tata nexon) గురువారం ఆవిష్కరించింది. దీని ధర రూ.8.09 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు నెక్సాన్‌ ఈవీ ఫేస్‌ లిఫ్ట్‌ను కూడా టాటా మోటార్స్ లాంచ్‌ చేసింది. దీని ధర రూ.14.74 లక్షల నుంచి రూ.19.94 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలోనే ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Nexon)

టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ 2023 మొత్తం 11 వేరియంట్లలో తీసుకొచ్చారు. క్రియేటివ్‌, క్రియేటివ్‌+, క్రియేటివ్‌+ ఎస్‌, ఫియర్‌లెస్‌, ఫియర్‌ లెస్‌ ఎస్‌, ఫియర్‌ లెస్‌+ ఎస్‌, ప్యూర్‌, ప్యూర్‌ ఎస్‌, స్మార్ట్‌, స్మార్ట్‌+, స్మార్ట్‌+ ఎస్‌ పేరిట ఈ వేరియంట్లను ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో ఇవి లభ్యం కానున్నాయి. రివోట్రోన్‌ 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 120 పీఎస్‌ పవర్‌, 170 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రివోటార్క్‌ 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 115 పీఎస్‌ పవర్‌ను, 260ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

త్వరలో విద్యుత్‌ రహదార్లు!

పెట్రోల్‌ వేరియంట్ 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 7 స్పీడ్‌ డీసీఏతో (డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌) వస్తోంది. డీజిల్‌ వేరియంట్‌ 6 స్పీడ్‌ ఎంటీ, 6 స్పీడ్‌ ఏఎంటీ ఆప్షన్లతో వస్తోంది. ఎక్స్‌టీరియర్‌ పరంగా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో బై ఫంక్షనల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, రీడిజైన్డ్‌ బంపర్స్‌, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. ఇందులో సిక్స్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్‌తో కూడిన 360 డిగ్రీల సరౌండ్‌ వ్యూ సిస్టమ్‌ ఉంది. మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మారుతీ సుజుకీ బ్రెజ్జా, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300కు నెక్సాన్‌ పోటీ ఇవ్వనుంది.


నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Nexon EV)

నెక్సాన్‌ ఈవీ ఫేస్‌ లిఫ్ట్‌ రెండు బ్యాటరీ వేరియంట్లలో వస్తోంది. మిడ్‌ రేంజ్‌లో 30 KWh బ్యాటరీ, లాంగ్‌ రేంజ్‌లో 40.5 KWh బ్యాటరీ అమర్చారు. ఇందులో క్రియేటివ్‌, ఫియర్‌లెస్‌, ఎంపవర్డ్‌ పేరిట వేర్వేరు ట్రిమ్స్‌ను తీసుకొచ్చారు. మిండ్‌ రేంజ్‌ నెక్సాన్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 325 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. లాంగ్‌ రేంజ్‌తో 465 కిలోమీటర్లు వెళ్లొచ్చని టాటా మోటార్స్‌ పేర్కొంది. 15ఏ ప్లగ్‌ పాయింట్ ద్వారా ఛార్జ్‌ చేస్తే మిండ్‌ రేంజ్‌ బ్యాటరీని 10.5 గంటలు, లాంగ్‌ రేంజ్‌ బ్యటరీని 15 గంటల పాటు ఛార్జీ చేయాల్సి ఉంటుంది. అదే ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో అయితే కేవలం 56 నిమిషాల్లో బ్యాటరీని (10-100 శాతం) ఫుల్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. కొత్తగా వెహికల్‌ టు వెహికల్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని కూడా టాటా మోటార్స్‌ అందిస్తోంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఇచ్చారు. ఆటోమ్యాటిక్‌ ఏసీ, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, సిక్స్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్‌స్పాట్‌ మానిటరింగ్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని