Tata Motors | జనవరి నుంచి టాటా కార్ల ధరల పెంపు.. ఈవీలూ ప్రియం

Tata Motors price hike: టాటా మోటార్స్‌ కార్ల ధరలను పెంచనుంది. జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. 

Published : 27 Nov 2023 19:03 IST

Tata Motors | దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata motors) తమ ప్యాసింజర్‌ వాహన ధరలు (Price hike) పెంచనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పెంపు చేపట్టనున్నట్లు తెలిపింది. విద్యుత్‌ వాహన (EV) ధరలూ పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత మేర పెంచేదీ టాటా మోటార్స్ పేర్కొలేదు.

జనవరి నుంచి మారుతీ, ఆడీ కార్ల ధరల పెంపు

‘‘జనవరి నుంచి ప్రయాణ, ఎలక్ట్రిక్‌ వాహన ధరలు పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. పెంపు మొత్తం, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నాం’’ అని టాటా మోటార్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే మారుతీ సుజుకీ, ఆడీ కంపెనీలు ధరల పెంపుపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్‌ ఇప్పుడే ఆ జాబితాలో చేరింది. దేశీయంగా టాటా మోటార్స్‌ టియాగో నుంచి సఫారీ వరకు వివిధ శ్రేణుల్లో వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని