Tata Motors: టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహన ధరలు మరోసారి పెంపు

Tata Motors price hike: టాటా మోటార్స్‌ తన కమర్షియల్‌ వాహన ధరలు పెంచుతోంది. అక్టోబర్‌ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

Updated : 21 Sep 2023 16:32 IST

Tata Motors price hike | దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్ (Tata motors) మరోసారి తన కమర్షియల్‌ వాహన (commercial vehicles) ధరలను పెంచనుంది. మూడు శాతం వరకు ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

LIC ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

ఉత్పత్తి ఖర్చులకు సంబంధించి మిగిలిన ప్రభావాన్ని భర్తీ చేయడానికి తాజా ధరల పెంపుదల చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్‌ వాహన శ్రేణిలోని అన్ని వాహనాలపైనా ధరల పెంపు ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న కమర్షియల్‌ వాహన ధరలను టాటా మోటార్స్‌ 5 శాతం వరకు పెంచింది. కమర్షియల్‌ వాహన శ్రేణిలో ఏస్‌, ఇంట్రా, యోధ పేరిట పికప్‌ వెహికల్స్‌తో పాటు ట్రక్కులను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు