LIC: ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్
Good news For LIC Agents and employees: ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. 13 లక్షల మంది ఏజెంట్లకు, లక్ష మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
Good news for LIC Agents and employees | దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి కొన్ని ప్రయోజనాలకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది. దీంతో లక్షలాది మంది ఏజెంట్లు, లక్షకు పైగా ఉన్న ఎల్‌ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎల్‌ఐసీ ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వారిక ప్రయోజనాలు అందించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే రీ అపాయింట్ అయిన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్ పొందేందుకు అర్హత కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుతం పాత ఏజెన్సీలో బిజినెస్ పూర్తి చేసిన వారికి రెన్యువల్ కమీషన్ అందడం లేదు.
క్రెడిట్‌కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు..!
ఎల్‌ఐసీ ఏజెంట్లకు టర్మ్ ఇన్సురెన్స్ కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ.3,000-10వేలు స్థాయి నుంచి రూ.25,000-1.50 లక్షల స్థాయికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీనివల్ల మృతి చెందిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. అలాగే, ఎల్‌ఐసీ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమం అందించేందుకు గానూ అందరికీ ఒకే తరహాలో 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ కింద అందివ్వనున్నట్లు తెలిపింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఏజెంట్లకు, లక్షకు పైగా రెగ్యులర్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎల్‌ఐసీ ఈ స్థాయికి చేరడానికి వీరి పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ కొనియాడింది. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటైన ఎల్‌ఐసీ.. 2023 మార్చి 31 నాటికి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
National Cinema Day: మల్టీప్లెక్స్‌లో రూ. 99కే సినిమా టికెట్.. ఆఫర్ ఆ ఒక్క రోజే!
-
Shubman Gill: ‘శుభ్‌మన్ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్‌లో దంచికొడతాడు’
-
Navadeep: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. సినీనటుడు నవదీప్‌కు నోటీసులు
-
Bigg Boss Telugu 7: ఎవరూ ఊహించని టాస్క్.. అమర్దీప్, ప్రియాంక.. గుండు చేయించుకునేది ఎవరు?
-
BJP: భాజపా ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ముట్టడి... నరసాపురంలో ఉద్రిక్తత