Ultraviolette: 323km రేంజ్‌.. 155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

అల్ట్రావయోలెట్‌ సంస్థ కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Published : 25 Apr 2024 14:20 IST

Ultraviolette | ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్‌ అల్ట్రావయెలెట్‌ (Ultraviolette) కొత్త ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. తొలుత ఎఫ్‌77 పేరిట తొలి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను తీసుకొచ్చిన ఈ సంస్థ.. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎఫ్‌77 మాక్‌ 2 (F77 Mach 2) పేరిట కొత్త ఈవీని విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్‌ ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులోని రికాన్‌ వేరియంట్‌ ధర రూ.3.99లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు తొలి వెయ్యి మంది కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది. 

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ బైక్‌ డిజైన్‌ పరంగా ఎఫ్‌77ను పోలి ఉంటుంది. పర్ఫార్మెన్స్‌ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఇందులో ఏబీఎస్‌ మోడ్‌ను ఆధునికీకరించారు. ఫ్రంట్‌ ఓన్లీ మోడ్‌ను పరిచయం చేశారు. రెయిన్‌, సిటీ, ట్రాక్‌ పేరుతో మూడు లెవల్స్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, ఆప్షనల్‌ టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఛార్జ్‌ లిమిట్‌, ఫైండ్‌ మై ఎఫ్‌77 వంటి ఫీచర్లున్నాయి. ఆన్‌బోర్డ్‌ నావిగేషన్‌తో కూడిన డిస్‌ప్లే ఇచ్చారు.

రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్‌ ఫ్రీ కంటెంట్‌, 4K వీడియో క్వాలిటీ

ఇక బైక్‌ పవర్‌ విషయానికొస్తే.. బేస్‌ వేరియంట్‌లో 7.1KWh బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చారు. 26KW మోటార్‌ అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 211 కిలోమీటర్లు (ఐడీసీ రేంజ్‌) వెళ్లొచ్చని కంపెనీ చెబుతోంది. రెకాన్‌ వేరియంట్‌లో 10.2 KWh బ్యాటరీ, 30KW మోటార్‌ను అమర్చారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 323 కిలోమీటర్ల రేంజ్‌ వెళుతుందని పేర్కొంది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ గంటకు 155 కిలోమీటర్లు. 15 నగరాల్లో ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని