Phone tapping case: భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది.

Published : 28 Mar 2024 18:11 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సైతం మరోసారి 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. 

ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్‌ఐబీలో సీఐగా పని చేశారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని