ఏసీపీ అక్రమాస్తుల కేసులో పురోగతి

మల్కాజిగిరి మాజీ ఏసీపీ నరసింహా రెడ్డి అక్రమాస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఆదాయానికి మించిన

Published : 03 Oct 2020 01:12 IST

విచారణ వేగవంతం చేసిన అనిశా  

హైదరాబాద్: మల్కాజిగిరి మాజీ ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరసింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వారం క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. బినామీ పేర్లతో నగరంలోని మాదాపూర్‌లో ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన కేసులో అనిశా అధికారులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని సర్వే నంబర్ 64లో 1960 గజాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని నలుగురు వ్యక్తులు 2016లో తమదని నకిలీ పత్రాలు సృష్టించి, 2018లో భూమిని ప్లాట్లు చేసి విక్రయించారు. మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి తన భార్య పేరుతో 490 గజాల భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మిగతా నలుగురు అదే సర్వే నంబర్‌లోని మూడు ప్లాట్లు కొనుగోలు చేశారు. నరసింహారెడ్డి తెరవెనుక ఉంటూ ప్రభుత్వ భూమిని తన బినామీల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అదే భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించినట్లు విచారణలో భాగంగా అనిశా అధికారులు తేల్చారు. నర్సింహారెడ్డి, తన బినామీల పేర్ల మీద ఉన్న 1960 గజాల స్థలం మార్కెట్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని అనిశా లెక్కగట్టింది. విచారణలో భాగంగా ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తోన్న క్రమంలో మాదాపూర్ భూమి వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని