Crime News: ప్రేమ వివాహం చేసుకుందని.. చెల్లెలిపై అన్న కత్తితో దాడి

ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో చెల్లిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

Updated : 12 Jan 2022 06:40 IST

కోవూరు: ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో చెల్లిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన యువతి, కోవూరు మండలానికి చెందిన యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అభ్యంతరం తెలపడంతో సోమవారం గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్సై వెంకటేశ్వరరావు వారిని మంగళవారం ఉదయం రండి.. ఇరు కుటుంబసభ్యులను పిలిచి మాట్లాడతామని చెప్పి పంపించేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వారు స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో యువతి అన్న అక్కడికి చేరుకొని కత్తితో దాడి చేశాడు. వెంటనే యువతిని చికిత్స నిమిత్తం కోవూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని