Hyderabad News: జైలు నుంచి విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌

నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టయిన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.

Published : 07 Sep 2022 11:51 IST

హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టయిన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్టుతో సౌదీ అరేబియా నుంచి వచ్చాడనే కారణంతో 2017లో అతడిని ముంబయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు  హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. 

అయూబ్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా.. సుమారు ఐదేళ్లుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి.  2010లో హైదరాబాద్‌లోని గోల్కొండ చిరునామాతో నకిలీ పాస్‌పోర్టును అయూబ్‌ఖాన్‌ తీసుకున్నాడు. దీనికి సహకరించిన అతడి భార్య హఫీజా బేగం, మరో ఇద్దరు ఖాజీలను కాలాపత్తర్‌ పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని