TS News: జాగ్రత్త..లిఫ్టు ఇస్తారు.. ఫోను, పర్సు కొట్టేస్తారు!

ఒంటరిగా ఉన్న ప్రయాణికులకు లిఫ్టు ఇస్తున్నట్లు ఆటో, కారులో ఎక్కించుకుని పర్సులు, సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

Updated : 31 Dec 2021 08:00 IST

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ చందనదీప్తి  

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఒంటరిగా ఉన్న ప్రయాణికులకు లిఫ్టు ఇస్తున్నట్లు ఆటో, కారులో ఎక్కించుకుని పర్సులు, సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. వివరాలను ఉత్తరమండలం డీసీపీ చందనదీప్తి వెల్లడించారు. చాంద్రాయణగుట్టవాసి ఫారూక్‌ఖాన్‌(29) ఆఫీజ్‌బాబానగర్‌వాసులు మహమ్మద్‌ ఖలీద్‌(23), సయ్యద్‌ ఖాజా(22) సల్మాన్‌ షరీఫ్‌(22), షేక్‌ ఇస్మాయిల్‌(19)లు స్నేహితులు. విలాసాల కోసం చోరీల బాటపట్టారు. అద్దెకు ఆటో, కార్లు తీసుకుని నగరంలో అత్తాపూర్‌, మెహిదిపట్నం, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో  ఒంటరిగా ఉన్న ప్రయాణికులను లిఫ్టు పేరిట ఎక్కించుకుంటున్నారు. ముఠా సభ్యులు ప్రయాణికుల మాదిరిగానే కూర్చొని సెల్‌ఫోన్‌, పర్సులు దొంగిలిస్తారు. ఈనెల 21న చిక్కడపల్లిలో ఉండే అడ్వొకేట్‌ సంజీవ్‌రావు వద్ద నిందితులు సెల్‌ఫోన్‌, పర్సు కాజేశారు. ఆయన ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రెండునెలలుగా ఇదే తరహాలో సెల్‌ఫోన్లను దొంగిలించినట్లుగా అంగీకరించారు. నిందితుల నుంచి 6సెల్‌ఫోన్లు, రూ.3500, కారు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని