రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో గురువారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు.

Published : 26 May 2023 04:36 IST

మృతుల్లో మూడేళ్ల బాలుడు  

కృష్ణా, న్యూస్‌టుడే: నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో గురువారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వీరిలో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాగనూరు మండలం ఓబుళాపూర్‌ గ్రామానికి చెందిన పల్లె అశోక్‌ (35) అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణా గ్రామానికి చెందిన ఆంజనేయులు (35), నర్సమ్మ (30)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారు తమ  పిల్లలు సమర్థ్‌ (5) అనిరుధ్‌ (3)లతో కలసి ద్విచక్రవాహనంపై మక్తల్‌ మండలం భూత్పూరుకు వెళ్తుండగా నల్లగట్టు సమీపంలో ఓబుళాపూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు సమాచారం. సమర్థ్‌ను రాయచూరులోని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అనిరుధ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు