Sangareddy: బాణామతి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి...

ఆధునిక కాలంలోనూ మూఢ నమ్మకాల పేరిట దాడులు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరులో శనివారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సకాలంలో స్పందించడంతో దంపతులకు ప్రాణాపాయం తప్పింది.

Updated : 18 Jun 2023 08:37 IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అమానుషం
ఎనిమిది మందిపై కేసు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ఆధునిక కాలంలోనూ మూఢ నమ్మకాల పేరిట దాడులు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరులో శనివారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సకాలంలో స్పందించడంతో దంపతులకు ప్రాణాపాయం తప్పింది. సదాశివపేట పట్టణ సీఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్కూరుకు చెందిన ముత్తంగి యాదయ్య, భార్య అమృతమ్మలను అదే గ్రామానికి చెందిన దాయాదులు అందరూ చూస్తుండగానే గ్రామ పంచాయతీ సమీపంలోని ఓ చెట్టుకు వేలాడేలా కట్టేసి దాడి చేశారు. దాయాది కుటుంబంలోని కొందరు అనారోగ్యానికి గురికాగా.. స్థానిక క్షుద్రపూజలు చేసే వ్యక్తిని ఆశ్రయించారు. మీ ఇంటి పక్కన ఉండే వ్యక్తే మీపై బాణామతి చేశాడని చెప్పడంతో శనివారం యాదయ్య, అమ్మతమ్మలను  పంచాయతీ సమీపానికి పిలిపించారు. బాణామతి చేస్తున్నారంటూ వారిని చెట్టుకు వేలాడదీసి కొట్టారు.  విషయం తెలుసుకున్న  పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులను చెదరగొట్టారు. యాదయ్య, అమృతమ్మలను  ఆసుపత్రిలో చేర్పించారు. 8మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని