ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!

ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 03 May 2024 06:42 IST

ప్రైవేటు బస్సులో రూ. 2.40 కోట్ల నగదు స్వాధీనం

గోపాలపురం, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి సీఐ బాలసురేష్‌బాబు వివరాల ప్రకారం.. గోపాలపురం మండలం జగన్నాథపురం శివారులో అంతర జిల్లా చెక్‌పోస్టు వద్ద హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగులను పరిశీలిస్తుండగా.. రెండు సంచుల్లో రూ.500 నోట్ల కట్టలు ఉన్నట్లు వారు గుర్తించారు. నగదును తరలిస్తున్న చెల్లయ్య అనే యువకుడిని ఎస్సై సతీష్‌కుమార్‌ ప్రశ్నించగా.. హైదరాబాద్‌ నుంచి తీసుకొస్తున్నానని, ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన డబ్బులని తెలిపారు. తగిన ఆధారాలు లేకపోవడంతో ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు సీజ్‌ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నగదును ఎవరికి అందించాలనే వివరాలు చెల్లయ్య వెల్లడించలేదని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని