పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి

వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది.

Published : 03 May 2024 06:05 IST

మడికొండ, న్యూస్‌టుడే: వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కుటుంబ సభ్యులు, తోటి రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి గ్రామానికి చెందిన రైతు దయ్యాల కుమారస్వామి(55)కి మడికొండ, ఎల్కుర్తి శివారులో ఎకరంన్నర వ్యవసాయ పొలం ఉంది. పత్తి, మొక్కజొన్న పంటల వ్యర్థాలను కాల్చేసి భూమిని సాగుకు సిద్ధం చేయాలని గురువారం పొలానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో వ్యర్థాలకు నిప్పు పెట్టారు. గాలి ఎక్కువవడంతో మంటలు పక్కపొలంలో నిల్వ చేసిన గడ్డివాములకు అంటుకున్నాయి. ఆందోళన చెందిన కుమారస్వామి చెట్ల కొమ్మలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా మంటల వేడికి కాళ్లు, చేతులు బొబ్బలెక్కాయి. పొగ కారణంగా ఊపిరి ఆడక స్పృహతప్పి పడిపోయి మృతి చెందారు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని