తెనాలిలో వైకాపా రౌడీషీటర్‌ అరాచకం

గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్‌ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్‌ రౌడీషీటర్‌గా ఉన్న సముద్రాల పవన్‌కుమార్‌ అలియాస్‌ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్‌లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు.

Published : 03 May 2024 02:29 IST

గొడవ వద్దని చెప్పినందుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దాడి

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్‌ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్‌ రౌడీషీటర్‌గా ఉన్న సముద్రాల పవన్‌కుమార్‌ అలియాస్‌ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్‌లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. పవన్‌కుమార్‌ వాహనం దిగి ఆయనను కొట్టాడు. ఆ ప్రాంతంలో కొద్దిసేపు వాహనాలు నిలిచాయి. అటువైపు వాహనంపై వెళుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కార్తీక్‌ సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా పవన్‌కుమార్‌ ఆయన్నీ కొట్టాడు. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. గురువారం ఫిర్యాదు అందడంతో పోలీసులు రౌడీషీటర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. నిందితుడు పవన్‌కుమార్‌ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ముఖ్య అనుచరుడు. ఆయనపై గతంలోనూ దౌర్జన్యం, దాడి కేసులున్నాయి. బాధితుడైన కార్తీక్‌ తండ్రి ఈదర పూర్ణచంద్‌ తెదేపా నాయకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు