వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత

వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్‌ అండ్‌ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్‌బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు.

Updated : 03 May 2024 07:54 IST

1,056 సీసాలు స్వాధీనం

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్‌ అండ్‌ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్‌బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. కొండమోడు సమీపంలో జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నోడల్‌ అధికారి కల్పశ్రీ, మరికొందరు అధికారులు వాహనాన్ని తనిఖీ చేయగా.. మద్యం సీసాలు కనిపించాయి. వాటిని వారు స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.58 లక్షలు ఉంటుంది. వీటిని ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీకి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పిడుగురాళ్ల సెబ్‌ ఇన్‌స్పెక్టరు సూర్యనారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని