Hyderabad: సైబర్‌ వలలో ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారి

ఓ ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారి సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సప్‌ వీడియో కాల్‌ రావడంతో సదరు అధికారి ఎత్తారు.

Updated : 03 Nov 2023 07:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓ ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారి సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సప్‌ వీడియో కాల్‌ రావడంతో సదరు అధికారి ఎత్తారు. ఓ మహిళ నగ్నంగా దర్శనమివ్వడంతో వెంటనే కట్‌ చేశారు. కానీ ఈలోపే ఆ కాల్‌ను రికార్డు చేసి, డబ్బులివ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగడంతో.. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారి ప్రస్తుతం జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని