Mahabubnagar: చికిత్స పొందుతూ సీఐ ఇఫ్తేకార్‌ అహ్మద్‌ మృతి

మహబూబ్‌నగర్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌)లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఇఫ్తేకార్‌ అహ్మద్‌ మృత్యువుతో పోరాడి మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Updated : 08 Nov 2023 07:22 IST

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌)లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఇఫ్తేకార్‌ అహ్మద్‌ మృత్యువుతో పోరాడి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆరు రోజులుగా హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గత గురువారం ఉదయం మహబూబ్‌నగర్‌లోని మర్లు - పాలకొండ రహదారిలో  తలకు, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలై తన కారులో ఉండగా ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డ కట్టింది. వైద్యులు ఆపరేషన్‌ చేసి చెడు రక్తాన్ని తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ మహేశ్‌, గ్రామీణ సీఐ స్వామి మృతదేహాన్ని శవ పంచనామా కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇఫ్తేకార్‌ అహ్మద్‌ కేసును హత్య కేసుగా మార్చారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న కానిస్టేబుల్‌ దంపతుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. ప్రధాన నిందితుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సీఐపై దాడి మహిళా కానిస్టేబుల్‌ ఇంట్లో జరిగిందా? కారులో జరిగిందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని