సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.

Published : 08 May 2024 03:52 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. కాల్పులకు పాల్పడిన సాగర్‌ పాల్‌, విక్కీ గుప్తాలకు ఆర్థిక సాయం చేశాడనే ఆరోపణలపై లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు చెందిన మొహమ్మద్‌ రఫీక్‌ చౌధరి (37) అనే వ్యక్తిని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడు సాగర్‌ పాల్‌, విక్కీ గుప్తాలతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా నిందితుడు ఘటన జరగడానికి ముందు అయిదు సార్లకు పైగా సల్మాన్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడని పేర్కొన్నారు. తాజా అరెస్టుతో కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి సంఖ్య ఐదుకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు