మహారాష్ట్రలో వంతెనపై నుంచి పడిపోయిన కారు

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తిరోడా భాజపా ఎమ్మెల్యే విజయ్‌ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కర్‌ రహంగ్డాలే కూడా ఉన్నారు. అవిష్కర్‌ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థి.

Published : 26 Jan 2022 05:07 IST

ఏడుగురు వైద్య విద్యార్థుల మృతి

వార్ధా: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తిరోడా భాజపా ఎమ్మెల్యే విజయ్‌ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కర్‌ రహంగ్డాలే కూడా ఉన్నారు. అవిష్కర్‌ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థి. సోమవారం అర్ధరాత్రి యావత్మాల్‌- వార్ధా రహదారిపై సెల్సురా గ్రామం వద్ద ఉన్న వంతెన దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జు కావడంతో విద్యార్థులంతా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా సావంగిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో చదువుతున్నారు. ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకొని పొరుగున ఉన్న యావత్మాల్‌ జిల్లా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వార్ధా ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని