Crime News: సూర్యాపేట సమీపంలో కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

కదులుతున్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో ఓ ప్రయాణికురాలిని డ్రైవర్‌ కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి(29) హైదరాబాద్‌లో బేబీ కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నారు.

Updated : 27 Feb 2022 07:19 IST

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

మూసాపేట, న్యూస్‌టుడే: కదులుతున్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో ఓ ప్రయాణికురాలిని డ్రైవర్‌ కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి(29) హైదరాబాద్‌లో బేబీ కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నారు. మాదాపూర్‌ ప్రాంతంలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త వేరుగా ఉంటున్నాడు. ‘‘సొంతూరికి వెళ్లేందుకు ఈ నెల 23న కూకట్‌పల్లిలో ప్రైవేటు బస్సు ఎక్కాను. చివరి సీటు కేటాయించారు. మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. నిద్రపోతుండగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డ్రైవర్‌ రాజేశ్‌(35) నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు బస్సు సూర్యాపేట దాటుతోంది. మరో డ్రైవర్‌ బస్సు నడుపుతున్నాడు. రాజేశ్‌ కత్తితో బెదిరించి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 24న ఉదయం బస్సు దిగుతుండగా బెదిరించి రూ.7 వేలు తీసుకున్నాడు’’ అని ఆమె వివరించారు. శనివారం ఆ మె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దౌర్జన్యం కేసులు నమోదు చేసినట్లు సీఐ నర్సింగ్‌రావు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె బంధువులు.. జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి హాజరై తిరిగివెళ్తున్న గవర్నర్‌ తమిళిసై కాన్వాయ్‌ను కూకట్‌పల్లి ఠాణా వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని