మూత్రశాల గోడకు కన్నం..

నిజామాబాద్‌లోని జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు బాలురు వెళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నాగారం ప్రాంతంలో ఉన్న ఈ జువెనైల్‌ హోంలో 8 మంది బాలురు అండర్‌ట్రయల్‌లో ఉన్నారు. మూత్రశాల

Published : 28 Jun 2022 05:36 IST

జువెనైల్‌ హోం నుంచి వెళ్లిపోయిన అయిదుగురు బాలురు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లోని జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు బాలురు వెళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నాగారం ప్రాంతంలో ఉన్న ఈ జువెనైల్‌ హోంలో 8 మంది బాలురు అండర్‌ట్రయల్‌లో ఉన్నారు. మూత్రశాల గోడను ఆదివారం ఉదయం నుంచి తవ్వడం ప్రారంభించినట్లు అధికారుల విచారణలో తేలింది. షవర్‌ రాడ్లను విరగ్గొట్టి.. వాటితో గోడకు రంధ్రం చేశారు. ఇతరులకు తెలియకుండా టీవీ శబ్దం  పెంచారు. రాత్రి 9.10 గంటల ప్రాంతంలో అయిదుగురు బయటకు వెళ్లిపోయారు. మిగతా ముగ్గుర్నీ రావాలని చెప్పినా.. వారు నిరాకరించారు. వెళ్లిపోయిన వారిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు ముగ్గురూ 16-17 ఏళ్ల వయసువారు. దీనిపై జువెనైల్‌ హోం సూపరింటెండెంట్‌ చార్వక్‌ నిజామాబాద్‌ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర జువెనైల్‌ వెల్ఫేర్‌, కరెక్షనల్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ స్ట్రీట్‌ చిల్డ్రన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మిర్జా రజా అలీ బేగ్‌, బాల న్యాయ మండలి అధ్యక్షురాలు సౌందర్య విచారణ జరిపారు. ఇన్‌ఛార్జి సూపర్‌వైజర్‌ గులాం హబీబ్‌ను విధుల నుంచి తొలగించారు. బాలుర కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని