విద్యుదాఘాతంతో తల్లీకుమార్తెల మృతి

విద్యుదాఘాతంతో తల్లీకుమార్తెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఖాద్లాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైతు తుకారాం తన

Published : 06 Jul 2022 04:58 IST

ప్రాణం తీసిన జీఏ తీగ

బాన్సువాడ, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో తల్లీకుమార్తెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఖాద్లాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైతు తుకారాం తన పెంకుటిల్లు ఎదుట రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. రేకులు గాలికి ఎగిరిపోకుండా ఉండేందుకు జీఏ వైరు సాయంతో గట్టిగా బిగించి కట్టారు. ఆయన ఇంటి ముందర స్తంభం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. సర్వీసు తీగ తెగిపోవడంతో రేకుల షెడ్డుకు కరెంటు సరఫరా అయింది. అక్కడే ఆడుకుంటున్న తుకారాం కుమార్తె అక్షర(6) జీఏ వైరును తాకింది. విద్యుత్తు సరఫరా కావడంతో విలవిల్లాడుతుండటంతో పక్కనే ఉన్న తల్లి అంకిత(25) చిన్నారిని కాపాడేందుకు పట్టుకోవడంతో ఇద్దరికి కరెంటు సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలోనే ఉన్న తుకారాం వారిద్దరు పడిపోవడం గమనించి పైకిలేపే ప్రయత్నం చేశారు. అప్పటికే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. తుకారాంనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. మృతి చెందిన పెద్ద కుమార్తె అక్షర మంగళవారం పాఠశాల బంద్‌ ఉండడంతో ఇంటి వద్దే ఉంది. బడికి వెళ్లుంటే ప్రమాదం తప్పేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని