భార్య జననావయవంపై వేడి కత్తి..

భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెతో అసహజ పద్ధతిలో శృంగారం జరుపుతుండటమే కాకుండా ఆమెను అనేక రకాలుగా వేధిస్తున్న ఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని షిప్రా పోలీసు స్టేషన్‌

Published : 26 Sep 2022 05:05 IST

ఇండోర్‌: భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెతో అసహజ పద్ధతిలో శృంగారం జరుపుతుండటమే కాకుండా ఆమెను అనేక రకాలుగా వేధిస్తున్న ఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని షిప్రా పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తాజాగా ఆ వ్యక్తి తన భార్య జననావయవంపై వేడిగా ఉన్న కత్తిని అదిమిపెట్టి ఉంచేశాడు. ఈ దారుణంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. తనపై ప్రతిరోజూ అనుమానం వ్యక్తం చేసే భర్త ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని