సంక్షిప్త వార్తలు(2)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో ఘోరం జరిగింది. నవంబరు 8న చెరుకు పొలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

Updated : 24 Nov 2022 05:59 IST

మొండెం, చేయి, కాలు వేరు చేసి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో ఘోరం జరిగింది. నవంబరు 8న చెరుకు పొలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. దానికి తల, చేయి, కాలు లేకపోవడంతో పోలీసులు ఆమె ఎవరనేది గుర్తించలేకపోయారు. ఈ కేసును తాజాగా ఛేదించారు. మృతురాలిని జ్యోతిగా గుర్తించారు. ఆమె భర్త పంకజ్‌ మౌర్యే.. నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. భార్యను గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం ఆమె శరీర భాగాలను వేరు చేశాడని పోలీసుల విచారణలో తేలింది.


నర్సుతో పెళ్లి కోసం మొదటి భార్య హత్య..

రెండో పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మొదటి భార్యకు ప్రాణాంతకమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. నిందితుడు స్వప్నిల్‌ సావంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్వప్నిల్‌ సావంత్‌.. కొన్నాళ్ల క్రితం ప్రియాంకను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్వప్నిల్‌కు అక్కడే ఓ నర్సుతో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. రెండో వివాహానికి అడ్డుగా ఉన్న మొదటి భార్య ప్రియాంకను హతమార్చాలని ప్రణాళిక రచించాడు. బీపీ, షుగర్‌ చికిత్స అని చెప్పి.. తాను పని చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన ప్రమాదకరమైన ఇంజెక్షన్లను ఆమెకు ఇచ్చాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts