నలుగురు యువకులకు జీవితఖైదు

బాలుడి (9)పై అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు జడ్జి కె.యస్‌.రామకృష్ణారావు మంగళవారం తీర్పు చెప్పారు.

Published : 30 Nov 2022 06:15 IST

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: బాలుడి (9)పై అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు జడ్జి కె.యస్‌.రామకృష్ణారావు మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... తెనాలి సమీపంలోని పెదరావూరుకు చెందిన సయ్యద్‌ ఫిరోజ్‌, షేక్‌ సుభానీ, షేక్‌ దస్తగిరి (కార్పెంటర్లు), షేక్‌ సుభానీ (తాపీ పని) స్నేహితులు. వీరంతా కలిసి 2013 మార్చి 8న... మూడో తరగతి చదువుతున్న బాలుడి (9)కి మాయమాటలు చెప్పి మామిడి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనను ఫోన్‌లో చిత్రీకరించారు. విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించారు. కొద్దిరోజుల తర్వాత అదే బాలుడ్ని బెదిరించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అతను అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు తెనాలిలోని ఓ ఆసుపత్రిలో చూపించారు. అప్పుడు బాలుడు అసలు విషయాన్ని వెల్లడించడంతో వారు తెనాలి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై భాస్కరరావు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్యామల కేసు వాదించారు. నేరం రుజువవడంతో కోర్టు... నలుగురికి జీవితఖైదుతోపాటు రూ.4 వేల చొప్పున జరిమానా విధించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు