రూ.360 కోట్ల విలువైన ద్రవ కొకైన్‌ స్వాధీనం

శ్రీలంకకు తరలించడానికి తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో సిద్ధంగా ఉంచిన రూ.360 కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని నౌకాదళం స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 30 Nov 2022 06:15 IST

డీఎంకే నాయకుల అరెస్టు

చెన్నై (వేలచ్చేరి), న్యూస్‌టుడే: శ్రీలంకకు తరలించడానికి తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో సిద్ధంగా ఉంచిన రూ.360 కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని నౌకాదళం స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు... రామేశ్వరం సమీపంలో మండపం- వేదాలై రహదారిలో ఆదివారం రాత్రి కోస్టుగార్డు పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఓ కారులో 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 30 క్యాన్లలో ద్రవ కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. వేదాలైకు చెందిన సాదిక్‌ అలీ (36) నాటు పడవలో శ్రీలంకకు తరలించడానికి వీటిని సిద్ధం చేసినట్లు తెలిసింది. ద్రవ కొకైన్‌ స్వాధీనం చేసుకుని, కారులో ఉన్న సోదరులు కీళక్కరై మున్సిపాలిటీ డీఎంకే మాజీ కౌన్సిలర్‌ జైనుద్దీన్‌ (45), 19వ వార్డు ప్రస్తుత కౌన్సిలర్‌ నవాజ్‌(42)లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.360 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని