Hyderabad: అశ్లీల వీడియోల్లో ఉన్నట్లుగా చేయాలని.. గ్యాంగ్‌రేప్‌లో విస్తుపోయే వాస్తవాలు

రాజధానిలోని హయత్‌నగర్‌లో పదో తరగతి బాలిక(17)పై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

Updated : 01 Dec 2022 13:03 IST

సామూహిక అత్యాచారం కేసులో విస్తుపోయే వాస్తవాలు

ఈనాడు- హైదరాబాద్‌, హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: రాజధానిలోని హయత్‌నగర్‌లో పదో తరగతి బాలిక(17)పై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.  ఫోన్‌లో అశ్లీల వీడియోలను తరచూ చూసిన విద్యార్థులు.. వాటిలో ఉన్నట్లుగా తామూ చేయాలని భావించారు. ఇందుకోసం పదో తరగతి చదివే తోటి స్నేహితురాలిని ఎంచుకుని ప్రణాళిక ప్రకారం అఘాయిత్యానికి ఒడిగట్టారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పదో తరగతి చదివే ఒక బాలుడు తన తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌ తీసుకుని అశ్లీల వీడియోలు చూసేవాడు. అదే పాఠశాలలో చదివే మరో ముగ్గురు విద్యార్థులకు వాటిని చూపించాడు. రోజూ పాఠశాల ముగియగానే వారంతా కలసి నిర్జన ప్రాంతాలకు వెళ్లి అలాంటి వీడియోలు చూసేవారు. ఈ తంతు నెలలపాటు సాగింది. ఈ క్రమంలో ఆయా వీడియోల్లో ఉన్నట్లుగా తామూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పదో తరగతి బాలికను ఎంచుకున్నారు. బాధితురాలు మనస్తత్వం భిన్నంగా.. తన వయసుకు తగ్గట్లుగా కాక చిన్నపిల్లలా ప్రవర్తించేదని గుర్తించారు. ప్రణాళిక ప్రకారం ఆమెకు మాయమాటలు చెప్పి.. పుస్తకం పేరుతో ఇంటికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వారిలో ఒకడు వీడియో తీశాడు.

మానవహక్కుల కమిషన్‌ ఆగ్రహం..

సామూహిక అత్యాచారానికి సంబంధించి బాధిత బాలిక పాఠశాల, నివసించే ప్రాంతం బహిర్గతం చేయడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్ని పత్రికలు, ఛానెళ్లలో బాలిక నివాసం, పాఠశాల ఫొటోలను ప్రచురించినట్లు కమిషన్‌ గుర్తించిందని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిందని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని