అటవీశాఖ అధికారులపై ఇసుక అక్రమార్కుల దాడి

అటవీశాఖ అధికారులపై ఇసుక అక్రమార్కులు దాడి చేసి గాయపర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

Published : 07 Dec 2022 04:05 IST

ఏబీవోకు గాయాలు... నిందితులపై కేసు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అటవీశాఖ అధికారులపై ఇసుక అక్రమార్కులు దాడి చేసి గాయపర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం మేరకు.. వాల్మీకిపురానికి చెందిన బీట్‌ ఆఫీసర్‌ సుబ్బలక్ష్మీ, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాజారెడ్డి (54) తరిగొండ ఫారెస్ట్‌ బీట్‌లో పనిచేస్తున్నారు. చిన్నాయునిచెరువుపల్లె సమీపంలోని తుమ్మకొండ అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అటవీ ప్రాంతం నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ట్రాక్టర్‌ నడుపుతున్న సీటీఎం గ్రామానికి చెందిన శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.  ట్రాక్టర్‌ను మదనపల్లె అటవీశాఖ కార్యాలయానికి తరలించే క్రమంలో రాజారెడ్డి ట్రాక్టర్‌లో కూర్చోగా సుబ్బలక్ష్మి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఇదే సమయంలో శివకుమార్‌, అతని ఇద్దరు అనుచరులు ఏబీవో రాజారెడ్డిపై దాడి చేసి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజారెడ్డి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, టార్చిలైట్‌లను తీసుకుని ట్రాక్టరుతో పరారయ్యారు. బాధితుడు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సత్యనారాయణ నిందితుడు శివకుమార్‌ అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని