Minor Girl: ఉచిత ఫోన్‌ ఆశ చూపి.. మైనర్‌ బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్‌ ఫోన్‌లు పంపిణీ చేస్తుందని బాలికను నమ్మించిన ప్రభుత్వ ఉద్యోగి.. ఆమెను తనతోపాటు తీసుకెళ్లిఅత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Updated : 13 Aug 2023 15:57 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరౌలీ (Karauli) జిల్లా తోడాభిమ్‌ ప్రాంతంలో మైనర్‌ బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఫోన్‌లు పంపిణీ చేస్తుందని ఆశ చూపి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

కరౌలీ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సునీల్‌ కుమార్‌ జన్‌గిడ్‌ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్‌ ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక తల్లిదండ్రులు రోజు వారీ కూలీలు. శనివారం వారు పనికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం గమనించిన సునీల్‌ కుమార్‌.. ఆమె ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఉచితంగా మొబైల్‌ ఫోన్‌లు పంపిణీ చేస్తోందని చెప్పాడు. బాలిక తనతోపాటు వస్తే ఫోన్ ఇప్పిస్తానని చెప్పి.. ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. 

అత్యాచార సమయంలో  ప్రతిఘటించడంతో నిందితుడు కత్తితో చేతులపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బాలికను ఆమె ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు  తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని