Andhra news: పోలీసులపై మట్టిచల్లిన ఆందోళన కారులు.. బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఉద్రిక్తత !

స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని మైథాన్‌ పరిశ్రమ వద్ద స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో

Updated : 09 Feb 2022 04:05 IST

బొబ్బిలి: స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని మైథాన్‌ పరిశ్రమ వద్ద స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న మహిళల్ని అదుపు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ..వారిని ప్రత్యేక వాహనాల్లో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వాహనాల్లో వెళ్లేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. ఈ క్రమంలో స్థానికులు,పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలు పోలీసులపై మట్టి చల్లారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఆందోళనకారులు శాంతించలేదు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా తరలించడం సరికాదంటూ.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులు వారించే ప్రయత్నం చేసినా ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మరింత మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని