Telangana News: అక్బరుద్దీన్‌పై కేసుల్లో నేడే తీర్పు.. పాతబస్తీలో అదనపు బందోబస్తు

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన కేసులకు సంబంధించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు అదనపు

Updated : 13 Apr 2022 07:46 IST

హైదరాబాద్‌: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన కేసులకు సంబంధించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పాతబస్తీలో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో తొమ్మిదేళ్ల క్రితం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని అక్బరుద్దీన్‌పై పోలీసులు 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం 30మందికి పైగా సాక్షులను విచారించింది. మరోవైపు ప్రసంగంలోని గొంతు అక్బరుద్దీన్‌దే అని ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ తేల్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని