Hyderabad News: నైనా జైస్వాల్‌పై అసభ్య కామెంట్లు.. యువకుడి అరెస్ట్‌

ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ను వేధింపులకు గురిచేసిన శ్రీకాంత్‌ అనే యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌

Updated : 14 Aug 2022 12:36 IST

హైదరాబాద్‌: ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను వేధింపులకు గురిచేసిన శ్రీకాంత్‌ అనే యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నైనా జైస్వాల్‌పై అసభ్య కామెంట్లు పెట్టడంతో సదరు యువకుడిని సిద్దిపేట పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతడి తీరులో మార్పురాలేదు. ఇటీవల మరోసారి అసభ్యకర సందేశాలు పెట్టడంతో నైనా తండ్రి అశ్వినీ జైస్వాల్‌ మూడు రోజుల క్రితం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేశారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని