Raj kundra: అశ్లీల చిత్రాల కేసు.. రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, ప్రముఖ బాలీవుడ్‌ తార శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరైంది........

Updated : 20 Sep 2021 20:11 IST

 

ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, ప్రముఖ బాలీవుడ్‌ తార శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో అరెస్టయిన దాదాపు రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ వచ్చింది. రూ.50వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు ఆయనకు సోమవారం బెయిల్‌ను మంజూరు చేసింది. పోర్నోగ్రఫీ కేసులో జులై 19న రాజ్‌కుంద్రా సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా.. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని