Crime News: ‘సత్ప్రవర్తన’తో జైలు నుంచి విడుదల.. మళ్లీ అత్యాచారం

అత్యాచారం కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి.. మళ్లీ అదే నేరానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Published : 18 Aug 2023 19:10 IST

భోపాల్: నేరస్థులకు శిక్ష విధించేది వారిని సరైన దారిలోకి తీసుకొచ్చేందుకే..! ఇదే విధంగా ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి (Rape Convict).. సత్ప్రవర్తన కింద విడుదలై.. మళ్లీ అదే నేరానికి పాల్పడటం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి సత్నా జిల్లాకు చెందిన రాకేశ్‌ వర్మ (35).. 12 ఏళ్ల క్రితం ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. కోర్టు అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. సత్ప్రవర్తన కింద ఏడేళ్లకే విడుదలయ్యాడు.

తోపులాటలో పట్టాలపై పడి.. రైలు కింద నలిగి..!

దాదాపు ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన అతడు.. ఇటీవల మరో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఆమెను మాటల్లో పెట్టి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. నిందితుడిపై ఈ మేరకు కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు