ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది.

Published : 29 Apr 2024 09:23 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని