TS News: ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు  మృత్యువాత పడ్డాడు. లాక్‌డౌన్‌ వేళ అధికారులు వాహనాన్ని..

Published : 24 May 2021 01:58 IST

జన్నారం: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు  మృత్యువాత పడ్డాడు. లాక్‌డౌన్‌ వేళ అధికారులు వాహనాన్ని ఆపుతారన్న భయంతో వేగంగా వెళ్లిన యువకుడు మిత్రుడి మృతికి కారణమయ్యాడు. అటవీ అధికారి గేటు ఎత్తి విలువైన ప్రాణాలు కాపాడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంత జరిగినా వెనకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో చూడకుండా బైక్‌ రైడర్‌ వేగంగా వెళ్లిపోవడం కొసమెరుపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని