Kota Suicides: ‘కోటా’లో ఆగని ఆత్మహత్యలు.. 8 నెలల్లో 17 మంది..!

రాజస్థాన్‌లోని కోటాలో ప్రవేశ పరీక్ష శిక్షణకోసం వచ్చే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు (Kota Suicides) పాల్పడుతుండటం కలవరపెడుతోంది.

Updated : 03 Aug 2023 14:26 IST

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. రెండు, మూడు వారాలకు ఒక ఆత్మహత్య కేసు నమోదవుతోంది. ఈ క్రమంలో మెడికల్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోన్న మరో విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మన్‌జ్యోత్‌ గుర్తించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 17 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రామ్‌పుర్‌కు చెందిన మన్‌జ్యోత్‌ ఛబ్రా.. మెడికల్‌ ఎంట్రాన్స్‌ ఎగ్జామ్‌ (NEET) శిక్షణ కోసం ఈ ఏడాది జనవరిలో కోటాకు వచ్చాడు. నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్న అతడు.. గురువారం ఉదయం తన హాస్టల్‌ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సీమా హైదర్‌కు సినిమా ఛాన్స్‌.. ఏ పాత్రలో నటించనుందంటే..?

వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 17కు చేరడం గమనార్హం. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని