Crime news: క్షణికావేశం.. నాలుగు కుటుంబాల్లో విషాదం

వివాహం అయి ఏడాదైనా పూర్తికాకముందే సున్నిత మనస్కులైన వివాహితులు తరచుగా స్వల్ప వివాదాలకు గురై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. వివరాలు ఇలా..

Updated : 18 Aug 2021 10:53 IST

మనస్తాపంతో తనువు చాలించిన వివాహితులు

జైనూర్‌, లింగాపూర్‌, న్యూస్‌టుడే

వివాహం అయి ఏడాదైనా పూర్తికాకముందే సున్నిత మనస్కులైన వివాహితులు తరచుగా స్వల్ప వివాదాలకు గురై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. నాలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. వివరాలు ఇలా..

రాథోడ్‌ గోవర్ధన్‌

* లింగాపూర్‌ మండలం పూల్‌సింగ్‌ నాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ గోవర్దన్‌(23)కు గతేడాది మోతిపాటార్‌కు చెందిన దివ్యతో పెళ్లయింది. దివ్య నాగులపంచమికి పుట్టింటికి వెళ్లింది. సోమవారం గోవర్దన్‌ తన భార్యను తీసుకురావడానికి వెళ్లాడు. అయితే దివ్యను కొన్నిరోజుల తరవాత పంపుతామని ఆమె కుటుంబ సభ్యులు తెలపడంతో.. ఆయన ఒంటరిగా ఇంటికొచ్చాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

విజయమాల

* జైనూర్‌ మండలం గుడామామడ గ్రామానికి చెందిన వాకుడే జ్ఞానివంత్‌ కుమార్తె విజయమాల(22)కు కెరమెరి మండలం అంతాపూర్‌ గ్రామానికి చెందిన తోడేకర్‌ విఠల్‌(24)తో ఆర్నెళ్ల క్రితం వివాహమైంది. అనంతరం వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో రెండు నెలల తర్వాత జ్ఞానివంత్‌ అల్లుడిని తన స్వగ్రామానికే పిలిపించుకొని కొంత సాగు భూమి ఇచ్చాడు. దీంతో వారిరువురు అదే గ్రామంలో నివాసముంటున్నారు. ఈక్రమంలో వారం క్రితం మళ్లీ భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ కావడంతో విఠల్‌ తన స్వగ్రామానికి వెళ్లాడు. సోమవారం సాయంత్రం గుడామామడాకు తిరిగి వచ్చి భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. అంతేకాకుండా తన లగేజీతో సహా తన ఇంటికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన విజయమాల మంగళవారం ఉదయం పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఉట్నూర్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు