Telugu akademi scam: రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 10
హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలను పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్‌రాజ్ అనే నిందితుల కోసం గాలిస్తున్నారు. కృష్ణారెడ్డి తొలుత ఈ కుంభకోణానికి తెరలేపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వెంకట సాయికుమార్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తేల్చారు.
సాయికుమార్ తొలుత కృష్ణారెడ్డిని సంప్రదించి కుంభకోణానికి తెరలేపినట్లు పోలీసులు నిర్ధరించారు. కాగా, కృష్ణారెడ్డి అకాడమీ చెక్కులను సాయికుమార్ ఇతర వ్యక్తులకు ఇచ్చినట్లు తేల్చారు. వీళ్లు భూపతి సాయంతో చందానగర్, సంతోష్‌నగర్ బ్రాంచ్‌ల్లోని యూబీఐ, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఏడాదికి చేయాల్సిన డిపాజిట్లను 15 రోజులకే చేసినట్లు పోలీసులు వివరించారు.
ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారంటే..
అక్రమాలకు పాల్పడిన రూ.64.5 కోట్లతో నిందితులుగా ఉన్న సాయికుమార్ రూ.20 కోట్లు, సత్యనారాయణ రూ.10 కోట్లు, వెంకటరమణ రూ.7 కోట్లు, కృష్ణారెడ్డి 6 కోట్లు, రమణారెడ్డి రూ.6కోట్లు, రాజ్‌కుమార్ రూ.3కోట్లు, మస్తాన్ వలి రూ.2.5 కోట్లు, భూపతి రూ.2.5కోట్లు, కెనరాబ్యాంకు మేనేజర్ రూ.2కోట్లు, పద్మనాభన్ రూ.50 లక్షలు, యోహన్‌రాజ్ రూ.50 లక్షలు మదన్ రూ.30లక్షలు తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!