Crime News: ఓటుకు నోటు కేసు.. నాంపల్లి కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్‌

ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రంపై నాంపల్లి కోర్టు విచారణ ప్రారంభించింది. కేసులో నిందితులుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సెబాస్టియన్ ఇవాళ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది...

Published : 04 Oct 2021 15:41 IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రంపై నాంపల్లి కోర్టు విచారణ ప్రారంభించింది. కేసులో నిందితులుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సెబాస్టియన్ ఇవాళ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. నాలుగో నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేం విచారణకు గైర్హాజరయ్యారు. సమన్లు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకానందున మత్తయ్యపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏసీబీ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవల అభియోగపత్రం సమర్పించింది. ఈడీ కేసు తదుపరి విచారణను ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఉన్నందున విచారణను నవంబరు 1కి కోర్టు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని