Road Accident: ఘోరం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 12 మంది సజీవదహనం!
రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్-జోధ్‌పూర్ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో
బర్మేర్: రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్-జోధ్‌పూర్ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు.
ఉదయం 9.55 గంటలకు బస్సు బలోత్రా నుంచి బయల్దేరింది. కాసేపటికే పచపద్ర సమీపంలో హైవేపై రాంగ్ రూట్లో వస్తోన్న ఓ ట్రక్కు బస్సును ముందునుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ పేలి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకుపోయిన 10 మందిని కాపాడారు. ఈ ఘటనలో 12 మంది మంటల్లో సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. కొందరు గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్‌తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్‌కు +84 (వియత్నాం) కోడ్‌తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్‌కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే