Nellore: కందుకూరులో దారుణం.. మహిళపై ముగ్గురు అత్యాచారయత్నం
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు మూగ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.

కందుకూరు పట్టణం: నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధిత మహిళ వారి నుంచి తప్పించుకొని పెట్రోల్ బంక్‌లోకి వెళ్లింది. బంక్‌లో పని చేస్తున్న సిబ్బంది మహిళను నిందితుల చెర నుంచి రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితుల్లో ఒకరు ఆటో డ్రైవర్ కాగా.. మరో ఇద్దరు కందుకూరు టౌన్‌లో గూర్ఖాలుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం డీఎస్పీ రామచంద్ర, సీఐ వెంకటరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై అత్యచారయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు
-
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ నిలిపివేత