కొవిడ్‌ కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ రోజు తెల్లవారుజమున ఈ ఘటన చోటుచేసుకుంది...

Updated : 25 Jul 2020 10:30 IST

ఏలూరు నేరవార్తలు : కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ రోజు తెల్లవారుజమున ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా జైలర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం, భీమవరానికి చెందిన ఇద్దరు నిందితులు పలు చోరీ కేసుల్లో అరెస్టయి ఏలూరు జిల్లా జైలులో ఏడాది నుంచి రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్నారు.

ఈ నెల 21న జైలులోని 74 మంది ఖైదీలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారందరికి అదే రోజు రాత్రి ఏలూరు శివారు ఒట్లూరులో ఉన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉన్న జంగారెడ్డి, భీమవరానికి చెందిన ఇద్దరు ఖైదీలు ఎస్కార్ట్‌ కళ్లుగప్పి శనివారం తెల్లవారుజామున పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న మిగిలిన ఖైదీలకు ఎస్కార్ట్‌ను అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని