
బ్యాగులో రూ.2కోట్ల విలువైన నకిలీ నోట్లు
గుంటూరు: గుంటూరు నగరంలో రూ.2కోట్ల విలువైన నకిలీ కరెన్సీ కలకలం రేపింది. ఏటుకూరు బైపాస్‌లోని వెంగళాయపాలెం గ్రామం వద్ద అనుమానాస్పద బ్యాగ్ ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. అందులో నకిలీ కరెన్సీని గుర్తించారు. నకిలీ 2వేల నోట్ల కట్టలు 119, రూ.500ల నోట్ల కట్టలు 17 స్వాధీనం చేసుకున్నారు.
క్యాష్ డిపాజిట్ యంత్రాల్లో నకిలీనోట్లు డిపాజిట్ చేసి ఇతర ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకుంటున్న ఉదంతాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయని పోలీసులు తెలిపారు. బ్యాగ్ దొరికిన మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. నోట్లను కలర్ జిరాక్స్ తీయించి ఉంచిన ముఠా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల మేడికొండూరు పోలీసులు నకిలీ నోట్ల ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యుల ప్రమేయంపైనా విచారిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.