Shraddha Walkar murder case: ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..!

ఆఫ్తాబ్‌ కొత్త స్నేహితురాలికి ముంబయిలోని తన ఇంటి గురించి తరచూ చెప్పేవాడు. అంతేకాదు.. ఆమెకు ఉంగరం, డియోడరెంట్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇటీవల పోలీసుల విచారణలో ఆమే స్వయంగా ఈ విషయాలు వెల్లడించింది. 

Published : 30 Nov 2022 15:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు చూసి అఫ్తాబ్‌ కొత్త స్నేహితురాలు షాక్‌లోకి వెళ్లింది. శ్రద్ధాను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచిన ఆఫ్తాబ్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా మరో యువతిని పరిచయం చేసుకొని ఇంటికి రప్పించాడు. ఆమె ఒక మానసిక వైద్యురాలు. ఇటీవల ఆమెను పోలీసులు విచారించారు. ఆఫ్తాబ్‌ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని ఆమె పోలీసులకు వెల్లడించింది. హత్య జరిగిన తర్వాత రెండు సార్లు తాను ఆ ఫ్లాట్‌కు వెళ్లినట్లు అంగీకరించింది. 

శ్రద్ధా హత్య  జరిగిన 12 రోజుల తర్వాత మే 30న అఫ్తాబ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు సాధారణంగానే కనిపించేవాడని పోలీసులకు తెలిపింది. కాకపోతే సిగరెట్లు అతిగా తాగేవాడని.. వాటిని అతడే స్వయంగా తయారు చేసుకొనేవాడని వివరించింది. అతడి వద్ద డియోడరెంట్‌, పెర్‌ఫ్యూమ్‌ల కలెక్షన్‌ ఉందని.. వాటిల్లో కొన్ని తనకు బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అక్టోబర్‌ 12వ తేదీన ఆఫ్తాబ్‌ తనకు ఫ్యాన్సీ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడని సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఆ నెలలో రెండు సార్లు అతడిని కలిసినట్లు తెలిపింది. ఆఫ్తాబ్‌ తరచూ ముంబయిలోని తన ఇంటి గురించి ఆమెతో చెప్పేవాడని పేర్కొంది. అతడు వివిధ రకాల మాంసాహార వంటకాలను ఆర్డర్‌ చేసి ఇంటికి తెప్పించుకొనేవాడని పేర్కొంది. కొన్ని సార్లు చెఫ్‌లు వంటకాలను ఎలా అలంకరిస్తారో కూడా వివరించేవాడని పేర్కొంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొన్నారు. ప్రస్తుతం సదరు యువతి తీవ్రమైన షాక్‌లో ఉండటంతో మానసిక చికిత్స పొందుతోంది. అఫ్తాబ్‌ డేటింగ్‌ సైట్ల సాయంతో దాదాపు 20 మంది మహిళలను సంప్రదించినట్లు పోలీసులు గుర్తించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని